వీఆర్‌పురం: పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ తెలిపారు. వీఆర్‌పురం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వీఆర్‌పురం, కూనవరం ఫేజ్ –2 ముంపు గ్రామాల జాబితాలో పేర్లు రాని వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీఆర్‌పురం మండలం పీడీఎఫ్‌ఎస్ నుంచి 510 దరఖాస్తులు, కూనవరం మండలంలో పీడీఎఫ్‌ఎస్ నుంచి 503 దరఖాస్తులు స్వీకరించినట్టు ఆయన చెప్పారు. పోలవరం పరిహారం చెల్లింపులో న్యాయం జరుగుతుందని, నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సరస్వతి, ఎస్‌డీసీలు ఆంజనేయులు, లక్ష్మీపతి, రవి, వెంకటేశ్వర్లు, అంబేడ్కర్, నరసరయ్య, వీఆర్‌పురం, కూనవరం ఆర్‌ఐలు జల్లి సత్యనారాయణ, మడకం రామకృష్ణ పాల్గొన్నారు.
చింతూరు ఐటీడీఏ పీవో
అపూర్వభరత్
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం