ముంచంగిపుట్టు: మండలంలో బాబుశాల పంచాయతీ బల్లుగూడ గ్రామానికి చెందిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గ్రామానికి చెందని 21 మంది చిన్నారులు స్థానిక సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నారు.వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుండడంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం 14మంది చిన్నారులను అంబులెన్స్‌లో పంపారు. కిల్లో కావ్యశ్రీ, కిల్లో మన్మధ, కిల్లో మీరంజన, పాంగి రియారోషి, వంతాల ప్రసాద్,వంతాల మల్లేష్, వంతాల హరి, కొర్ర మరియా, కొర్ర మీన, వంతాల పల్లవి, కొర్ర మీనాక్షి, వంతాల రాజేష్, వంతాల రామదాసు, వంతాల శశిలకు జ్వరం, దగ్గు, జలుబు తగ్గకపోవడంతో జిల్లా ఆస్పత్రికి పంపినట్టు వైద్యులు గీతాంజలి, సంతోష్ తెలిపారు. అంతకుముందు సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్న బల్లుగూడ చిన్నారులను తహసీల్దార్ నర్సమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, సీపీఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాఽథ్‌లు పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నాటువైద్యం,పసరమందుల జోలికి పోవ ద్దని చిన్నారుల తల్లిదండ్రులకు వారు సూచించారు.
14 మంది చిన్నారులు పాడేరు ఆస్పత్రికి తరలింపు