హుకుంపేట మండలం గడుగుపల్లి ప్రాంతంలో
పూత లేని మామిడిచెట్లు
చింతపల్లి మండలం చెరుకుంపాకలు ప్రాంతంలో పూతలేని మామిడిచెట్లు
సాక్షి,పాడేరు: జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ సమయానికి పూలతో సింగారించినట్టుగా కళకళలాడవలసిన మామిడి చెట్లు పూతలేక కళావిహీనంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థిలు అనుకూలించకపోవడం మామిడి పూతపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని చెట్లకు మాత్రమే మామిడి పూత రాగా, సుమారు 70 శాతం చెట్లకు పూత కన్నా చిగురుటాకులే అధికంగా కనిపిస్తున్నాయి. కొండమామిడి రకం అంటే పెద్ద చెట్లకు మాత్రం అక్కడక్కడా పూత ఏర్పడగా,గిరిజనుల ఆధీనంలోని సాగవుతున్న మామిడితోటలు మాత్రం పూత లేక కళతప్పాయి.
అధిక వర్షాలే కొంపముంచాయి.
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ ప్రభావం మామిడి పూతపై పడింది. అధిక వర్షాల వల్లే మామిడి పంటకు నష్టం కలిగిందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ స్థాయిలో వర్షాలు కురిస్తే మామిడిపంటకు ఎంతో మేలు జరగడంతో పాటు జనవరి నెల నుంచే మామిడి పూత ఆశాజనకంగా ఉండి,మార్చి నెల నాటికే పిందెలు, కాయ దశతో తోటలు కళకళలాడేవి.అయితే సాధారణ స్థాయికి మించి వర్షాలు కురవడంతో మామిడిచెట్ల పూత రాకుండా పోయింది.
భారీగా తగ్గనున్న దిగుబడులు
జిల్లా వ్యాప్తంగా బంగినపల్లి,కలెక్టర్,రసాలు,సువర్ణరేఖ వంటి రకాల మామిడితోటలు ఆరు వేల ఎకరాల్లో ఉన్నాయి.ఎకరం తోటకు ప్రతి ఏడాది నాలుగు టన్నుల వరకు దిగుబడికి వస్తుండడంతో రైతులకు కనీసం రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఆదాయం లభించేది. వాతావరణం బాగుంటే ఏటా మాదిరిగా 24 వేల టన్నుల దిగుబడి లభించేది. అయితే ఈసారి మామిడితోటల్లోని చెట్లకు పూత తక్కువుగా ఉండడం,కొన్ని చెట్లకు పూర్తిగా లేకపోవడంతో మామిడిపంట దిగుబడులు భారీగా తగ్గనున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే పూత వచ్చిన చెట్లకు కూడా పిందెదశ ఆలస్యమవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
కానరాని
ప్రతికూల
వాతావరణంతో
పిందెలు ఆలస్యం
కొంప
ముంచిన
అధిక వర్షాలు
జిల్లాలో
6వేల ఎకరాల్లో మామిడిపంట
చిగురుటాకులే అధికం
గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధిక వర్షాలు మామిడి పంటకు ప్రతికూలంగా మారాయి. మామిడిచెట్లకు పూత కన్నా చిగురుటాకులు అధికంగా ఉండడాన్ని పరిశీలించాం.మామిడి దిగుబడులు కూడా పూర్తిగా తగ్గుతాయి.అయితే వచ్చే ఏడాది మాత్రం ముందస్తుగానే పూత ఏర్పడుతుంది.
– రమేష్‌కుమార్ రావు,
జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరు
చెట్లకు తగ్గిన పూత
అర ఎకరంలో మామిడి సాగు చేస్తున్నాను.నాతో పాటు మా గ్రామంలో చాలామందికి మామిడిచెట్లు ఉన్నాయి.అయితే ఈఏడాది చెట్లకు పూత పూర్తిస్థాయిలో రాలేదు. కొన్ని చెట్లకు చిగురుటాకులే అఽధికంగా ఉన్నాయి.ఈఏడాది మామిడి పంటకు పూత దశలోనే నష్టం ఏర్పడింది. కొన్ని చెట్లకు పిందె కూడా ఏర్పడలేదు.
– కాకరి బుల్లిరాజు, రైతు, గడికించుమండ
పంచాయతీ, హుకుంపేట మండలం
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. మచ
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. మచ
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. మచ