గూడెంకొత్తవీధి: మండలంలోని రంపుల గ్రామంలో మల్లేశ్వరమ్మ మహోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు నరేష్, బాలరాజుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలుగా నిలచిన ఏబులం, నల్లబిల్లి జట్లకు పీఆర్ జేఈ జ్యోతిబాబు ఉపాధ్యాయుడు బాలకృష్ణల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. పంచాయతీ సర్పంచ్ వంశీకృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు కంకిపాటి గిరిప్రసాద్, గెమ్మెలి దొరబాబు, వీరోజి సత్తిబాబు, సిరిబాల రామారావు, కంకిపాటి రామారావు పాల్గొన్నారు.