పాడేరు : ఇటీవల జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి (ఏడీఎంహెచ్‌వో)గా నియమితులైన డాక్టర్ టి.ఎన్.ప్రతాప్ మంగళవారం పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగంలను మర్యాదపూర్వకంగా కలిశారు. పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల్లో సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తం చేయాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగంలు ఏడీఎంహెచ్‌వోకు సూచించారు. ఉత్తమ సేవలు అందించి గిరిజనుల మన్ననలు పొందాలని తెలిపారు.