పాడేరు: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్య సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరులోని డీఈవో కార్యాలయంలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6,7,8 తరగతుల్లో బ్యాక్‌ల్యాగ్ సీట్లు, జూనియర్ ఇంటర్మీడియెట్, డిగ్రీకళాశాల్లో సీట్లు భర్తీ చేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు http://apr.apcfss.in వెబ్ సైట్‌లో ఈనెల 31న తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ జె.ఎన్.సంధ్యాభార్గవి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, సిబ్బంది ప్రభావతి పాల్గొన్నారు.