సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాముల్లో భద్రపరిచిన పాడేరు, రంపచోడవరం, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను పరిశీలించేదుకు పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదాములను తెరిచారు. ఈవీఎంలు,వీవీ ప్యాట్,బ్యాలెట్‌లను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవీఎంల గోదాములను తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. గోదాముల వద్ద పోలీసు భద్రత చర్యలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కె.పద్మలత,తహసీల్దార్ వంజంగి త్రినాథరావునాయుడు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.