విశాఖ సిటీ: విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక రాజధాని విశాఖను పర్యాటక, వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి పారదర్శకంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు. రూ.80 కోట్లతో సిరిపురంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్‌పార్కింగ్, కమర్షియల్ భవనం పనులు తుది దశకు చేరుకున్నాయని, సీఎంతో ప్రారంభిస్తామన్నారు. బీచ్ రోడ్డులో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న యూహెచ్3హెచ్ హెలీకాఫ్టర్ మ్యూజియాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అనకాపల్లిలో 7 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనకాపల్లిలో కొత్తూరు చెరువును అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. మధ్య తరగతి ప్రజల కోసం పాలవలస, గంగసాని అగ్రహారం, అడ్డూరు, గరివిడి, రామవరం వంటి ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో అందుబాటు ధరల్లో ఎంఐజీ ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని లేఅవుట్ల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా మాస్టర్‌ప్లాన్–2041ను రూపొందిస్తామని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ స్పష్టం చేశారు.
అందుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్
వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్