కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు: టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు,ఇన్విజిలేటర్లపై ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు.సోమవారం ప్రారంభమైన టెన్త్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,శ్రీకృష్ణాపురం,తలారిసింగి ఆశ్రమ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ డివైజెస్,స్లిప్‌లు లేవని నిర్ధారించిన తరువాతే లోపలికి పంపాలని ఆదేశించారు.తొలిరోజు పరీక్షకు 117మంది విద్యార్థులు,ఓపెన్ టెన్త్‌లో పాడేరుకు సంబంధించి 9మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.ఎక్కడా మాస్ కాపీయింగ్ లేకుండా తొలి పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. డీఈవో పి.బ్రహ్మజీరావు,ఎంఈవో–2 సరస్వతి,హెచ్‌ఎంలు పాల్గొన్నారు.