చింతపల్లి: జిల్లాలో అర్హులైన గిరిజన యువతీ యువకులకు విభిన్న రంగాల్లో వారి అభిరుచి మేరకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి పలు పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రోహిణి తెలిపారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని మూడు చోట్ల, ప్రత్యేకంగా ఎటపాకలో ప్రస్తుతం స్కిల్ హబ్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఇక్కడ ఇప్పటికే 698 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ప్రస్తుతం మరో 640మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాపరిధిలో ప్రతినెలా రెండు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతీయువకులు సెల్‌ఫోన్‌ల ద్వారా నే నెపుణ్యం యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు సరళ్ కార్యక్రమంలో అవసరమైన ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు.