సింహాచలం (విశాఖ) : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్టు సింహాచలం దేవస్థానం ఏఈవో ఎన్. ఆనంద్‌కుమార్ మంగళవారం తెలిపారు. 22న శ్రీనృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్టు పేర్కొన్నారు. నమళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా గురువారం రాత్రి 7గంటల వరకు మాత్రమే దర్శనాలు లభిస్తాయని తెలిపారు. భక్తులంతా ఈ విషయాలను గమనించాలని కోరారు.
నేడు కృష్ణాపురంలోని గోశాలలో
శ్రీనృసింహ జయంతి
శ్రీ నృసింహ జయంతిని బుధవారం సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో విశేషంగా నిర్వహిస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. సాయంత్రం 4గంటల నుంచి గోశాలలో ఉన్న భారీ నృసింహుడి విగ్రహం వద్ద ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులంతా ఈకార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.