గిరి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యం

ట్రాక్టర్‌ను నడుపుతున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి  - Sakshi

రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రవేశపెట్టిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో రూ.1,27,27,245ల వ్యయంతో రంపచోడవరం మండలంలో ఒక ట్రాక్టర్‌, దేవీపట్నం మండలంలో రెండు ట్రాక్టర్లు, ఏటపాక మండలంలో మూడు ట్రాక్టర్లు, కూనవరం మండలంలో ఒక ట్రాక్టర్‌, వీఆర్‌పురం మండలంలో మూడు ట్రాక్టర్లు, చింతూరు మండలంలో మూడు ట్రాక్టర్లు రైతులకు అందజేసినట్టు తెలిపారు. వ్యవసాయ పరికరాలు కూడా గిరిజన రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులకు 40 శాతం రాయితీపై ట్రాక్టర్లు అందజేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఐదుగురు గిరిజన రైతులు సభ్యులుగా ఉండి ట్రాక్టర్‌ ద్వారా వచ్చిన ఆదాయం వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. సబ్సిడీపై విత్తనాలు, రుణాలు అందజేస్తున్నట్టు ఆమె వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బంధం శ్రీదేవి, కుంజం మురళీ, జెడ్పీటీసీలు పండ వెంకటలక్ష్మి, కృష్ణవేణి, వైస్‌ ఎంపీపీలు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పండా కుమారి, రంపచోడవరం సర్పంచ్‌లు మంగా బొజ్జయ్య, వడగల ప్రసాద్‌బాబు, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు కోసు రమేష్‌ బాబు. ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, తుర్రం వెంకటేశ్వర్లు దొర, కుంజం వంశీ, షేక్‌ కాజా వల్లీ, వ్యవసాయ కమిటీ చైర్మన్‌ డొక్కులూరి రత్నరాజు, ఏడీఏ సీహెచ్‌వీ చౌదరి, ఏవో లక్ష్మణ్‌, హెచ్‌వో రమేష్‌ పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే

నాగులపల్లి ధనలక్ష్మి

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో

పంపిణీ




 

Read also in:
Back to Top