సాక్షి,పాడేరు: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రభాత్‌కుమార్ సింగ్ కుటుంబ సమేతంగా మూడు రోజుల పాటు జిల్లాలోని మన్య ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో చింతపల్లి మండలం లంబసింగిలో పర్యటించి, ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షిస్తారు. ఆరో తేదీ ఉదయం లంబసింగి నుంచి పాడే రు మీదుగా అరకులోయకు చేరుకుంటారు. అరకులోయలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించిన అనంతరం అరకులోయలో బస చేస్తారు. ఏడవ తేదీ మధ్యాహ్నం అరకులోయ నుంచి బయలు దేరి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. ప్రభుత్వ అతిథి గృహంలో న్యాయమూర్తి బస చేస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది.