● అడుగంటిపోతున్న భూగర్భజలాలు ● మూడు మండలాల్లో మరీ తీవ్రంగా.. ● ఎల్‌నినోతోనే వర్షాభావ పరిస్థితులు ● నీటిపొదుపు పాటించకుంటే ముప్పే | - | Sakshi
Sakshi News home page

● అడుగంటిపోతున్న భూగర్భజలాలు ● మూడు మండలాల్లో మరీ తీవ్రంగా.. ● ఎల్‌నినోతోనే వర్షాభావ పరిస్థితులు ● నీటిపొదుపు పాటించకుంటే ముప్పే

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

● అడుగంటిపోతున్న భూగర్భజలాలు ● మూడు మండలాల్లో మరీ తీవ్రంగా.. ● ఎల్‌నినోతోనే వర్షాభావ పరిస్థితులు ● నీటిపొదుపు పాటించకుంటే ముప్పే

కై లాస్‌నగర్‌: జిల్లాకు ఎల్‌నినో ముప్పుపొంచి ఉంది. దీని ప్రభావంతో ఈ వానా కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబు తున్నారు. జూన్‌ నెలాఖరుకు చేరుకుంటున్నా ఇప్పటివరకు ఒక్క భారీ వ ర్షం కురవకపోవడం ఎల్‌నినో తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే భూ గర్భజలాలు అడుగంటాయి. పాతాళగంగ 9.78 మీటర్ల లోతుకు పడిపోయింది. దీంతో పలు మండలాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవడం ఉత్తమమని, వృథా చేస్తే మనుగడ కష్టమేనని భూగర్భజల శా ఖ అధికా రులు హె చ్చరిస్తున్నా రు. జలసంరక్షణ చర్యలు చేపడుతూ నీటి ని ఆదా చేస్తేనే రాబో యే రోజుల్లో నీటి కష్టాల ను అధిగమించే అవకాశము ంటుందని అభిప్రాయపడుతున్నారు.

పలు మండలాల్లో ప్రమాద ఘంటికలు

జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతూ అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటి దిగువ మట్టం కొంత పరవాలేదనిపించినా పలు మండలాల్లో నీటిమట్టం తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో మే నెలలో భూ గర్భజల మట్టం 11.83 మీటర్ల దిగువకు చేరగా, ఈసారి 9.78 మీటర్ల దిగువనే ఉంది. గతేడాది కంటే 2.06 మీటర్ల ఎత్తున నీటిమట్టం ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో చెరువులు, వాగులు, ప్రాజెక్ట్‌లు అడుగంటి ఎడారులను తలపిస్తున్నాయి. బోరుబావుల్లోనూ నీటిమట్టం తగ్గి పలుచోట్ల వాటిలోంచి నీరు రాని పరిస్థితి నెలకొంది. కాగా, జిల్లాలోని కొన్ని మండలాల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గింది. జిల్లాలోని బోఽథ్‌, నేరడిగొండ, భీంపూర్‌ మండలాల్లో నీటిమట్టం పరిస్థితి తీవ్రంగా తగ్గి డ్రై ఏరియాకు చేరుకుంటోంది. దీంతో ఆయా మండలాల్లో బోర్లు, చేదబావుల్లో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

తగ్గుతున్న నీటి మట్టాన్ని కాపాడుకోవాలంటే వర్షపునీటిని ఒడిసిపట్టేలా సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టి వర్షపునీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వివిధ అవసరాలకు వాడే నీటిని వృథాగా పోనీయకుండా పొదుపుగా వినియోగించాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులతో ఉన్న వనరులను వృథా చేసుకుంటే భవిష్యత్‌లో నీటి కష్టాలు తలెత్తి మనుగడ కష్టమయ్యే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ఎక్కువగా నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమమని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement