ఆదిలాబాద్‌రూరల్: అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. శుక్రవారం మావల పోలీస్‌స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 127 ద్విచక్రవాహనాలు, 26 ఆటోలు, ఒక కారు, అక్రమంగా నిల్వ చేసిన 68 క్వార్టర్ బాటిళ్ల మద్యం, ఆరు బీర్‌బాటిళ్లు, మూడు లూస్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారణా యుధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడు తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రో డ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంకెన్‌డ్రైవ్‌తో కలిగే అనర్ధాల గురించి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అ ప్రతమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీలు జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు ప్రేమ్‌కుమార్, ఫణిధర్, చంద్రశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, రాధిక, మనీశ్, పోలీస్ జాగిలం రోమా, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రయాణికులు, అనుమానాస్పద వ్యక్తులు, వారి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు సే కరించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తనిఖీల్లో నార్కోటిక్స్ గుర్తింపు జాగిలం ‘రోమా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం సహాయంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద సామగ్రి, ప్రయాణికుల లగేజీని పరిశీలించారు. రైల్వే మార్గాల ద్వారా గంజాయి, ఇతర మా దకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పో లీస్‌శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని తెలి పారు. గంజాయి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా పోలీసులకు 8712659973 నంబర్‌లో వాట్సాప్ ద్వారా తెలుపా లని కోరారు. సమాచారం అందించిన వారి వివరా లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యు వత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, రైల్వే భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.


