● 19 మండలాల్లో వర్షాభావం ● విత్తనాలు వేసిన రైతుల్లో గుబులు ● త్వరితగతిన వర్షాలు పడితేనే ఊరట ● లేనిపక్షంలో విత్తనం నష్టమే! | - | Sakshi
Sakshi News home page

● 19 మండలాల్లో వర్షాభావం ● విత్తనాలు వేసిన రైతుల్లో గుబులు ● త్వరితగతిన వర్షాలు పడితేనే ఊరట ● లేనిపక్షంలో విత్తనం నష్టమే!

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● 19 మండలాల్లో వర్షాభావం ● విత్తనాలు వేసిన రైతుల్లో గుబులు ● త్వరితగతిన వర్షాలు పడితేనే ఊరట ● లేనిపక్షంలో విత్తనం నష్టమే!

వ్యత్యాసం

– 56 శాతం

స్థితి

వర్షాభావం

సాధారణ

82.6 మి.మీ.లు

సాక్షి,ఆదిలాబాద్‌: ఈ వానాకాలంలో చిరు జల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు 82,870 ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి రైతులు విత్తనాలు విత్తినట్లు చెబుతున్నారు. అనధికారికంగా సుమారు 2లక్షల ఎకరాల వరకు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేసినట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో వర్షాధారంగానే పంటల సాగు ఉండడంతో విత్తనాలు వేసిన రైతులు నింగి వైపు చూస్తున్నారు. రెండు రోజుల్లో వానలు లేకుంటే విత్తన దశలోనే రైతు తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి.

భారీ వర్షాలు ఏవి..

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రుతుపవనాలకు ముందు కురిసే తేలికపాటి వర్షాలే ఇప్పటివరకు నమోదైన ట్లు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌ కంటే ముందే మే చివరిలోనే జిల్లాలో భారీ వర్షాలు కు రిశాయి. దీంతో రైతులు మొదటి వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు వేశారు. అప్పట్లో ఆ వర్షాలు రై తుకు కలిసి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా తలమడుగు, సొనాల మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వర్షాభావ పరి స్థితులే నెలకొన్నాయి. బజార్‌హత్నూర్‌ మండలంలో చుక్కవాన పడలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు.

సమయ ఆందోళన..

జూన్‌ మొదటి రెండు వారాల్లోనే రైతులు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేస్తారు. వర్షాలు కురిస్తే అవి మొలకెత్తుతాయనే ఆశతో ముందుకెళ్తారు. జూన్‌ చివరి వరకు కూడా పత్తి విత్తనాలు వేయడాన్ని సాధారణ సాగుగానే పరిగణిస్తారు. జూలై మొదటి వారంలో కొంత ఆలస్యంగా, ఆ తర్వాత వారాన్ని పూర్తిగా ఆలస్యంగా పరిగణిస్తారు. సోయా విషయానికొస్తే జూలై లోపే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో సాగుతోనే ఉత్పాదకత పెరుగుతుందని రైతుల్లో విశ్వాసం. ఆలస్యంగా సాగు చేయడం ద్వారా చీడపీడలు, ఎదుగుదల లోపం, కాత, పూత సరైన సమయంలో రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై పంట నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా జూన్‌లోనే విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గుచుపుతుంటారు.

నింగి వైపు రైతు చూపు

బజార్‌హత్నూర్‌ మండలంలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 90 మి.మీ.ల వర్షపాతం కురువాలి. ఇక్కడ ఒక్క మి.మీ. కూడా నమోదు కాలేదు. దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు సంకోచించే పరిస్థితి. అయినా 800 ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. వరుణుడి కరుణ కోసం కర్షకులకు ఎదురుచూపు తప్పట్లేదు.

తొందరపడొద్దు..

ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు తేలికపాటి వానలే కురిశాయి. వర్షాధారంగానే పంటలు సాగు చేసే పరిస్థితి ఉండడంతో రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయడం శ్రేయస్కరం. జూన్‌ చివరి వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దు.

– శ్రీధర్‌ చౌహాన్‌, ప్రధాన శాస్త్రవేత్త,

వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్‌

అందుబాటులో పత్తి విత్తనాలు

జిల్లాలో ఇప్పటివరకు రైతులు రెండున్నర లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయించారు. 11లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. – రవీందర్‌ సింగ్‌,

జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement