● ఐటీడీఏ పీవో మంద మకరందు ● ఇంద్రవెల్లి మండలంలో పర్యటన | - | Sakshi
Sakshi News home page

● ఐటీడీఏ పీవో మంద మకరందు ● ఇంద్రవెల్లి మండలంలో పర్యటన

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు ● ఇంద్రవెల్లి మండలంలో పర్యటన

ఇంద్రవెల్లి: ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వి నియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండలంలోని సమాక గ్రామాన్ని శనివారం ఉదయం సందర్శించి ఉపాధి హామీ ప నులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమాక, పాటగూడ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, బోరుబావులు మంజూరు చేయాలని విన్నవించగా పంచా యతీ తీర్మానాలు ఇస్తే మంజూరుకు కృషి చేస్తానని పీవో పేర్కొన్నారు. అక్కడి నుంచి ఐఎఫ్‌పీసీఎల్‌ జిన్నింగ్‌ మిల్లును సందర్శించిన ఆయన కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. సంస్థ నిర్వహణ పై చర్చించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు.అమరులకు నివా ళులర్పించి స్థానికులను స్మృతి వనం వివరాలు అడి గి తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక ప్రభు త్వ ఆస్పత్రికి చేరుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. గర్భిణులకు మె రుగైన సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనో హర్‌, వైద్యులు పూజిత, సర్పంచ్‌లు మోహన్‌సింగ్‌, రాజేశ్వర్‌,ఏపీవో శ్రీనివాస్‌,ఆయా గ్రామాల ప్రజ లు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement