అతివలకు రక్షణగా షీటీమ్‌ | - | Sakshi
Sakshi News home page

అతివలకు రక్షణగా షీటీమ్‌

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

ఆదిలాబాద్‌టౌన్‌: అతివలకు రక్షణగా షీటీమ్‌ పనిచేస్తుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నివేదికను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 24 గంటల పాటు షీటీమ్‌ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతనెలలో 59 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పోలీసు అక్కా కార్యక్రమం ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్‌క్రైమ్‌, మోసపోతున్న సంఘటనలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. హాట్‌స్పాట్లలో తనిఖీల సందర్భంగా గుర్తించిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించామని, అలాగే 40 మందిపై ఈపెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, చెడు మార్గంలో పయనించవద్దని సూచించారు. షీటీమ్‌ సభ్యులు సుశీల, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement