25 శాతం కోటా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

25 శాతం కోటా అమలు చేయాలి

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

కై లాస్‌నగర్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ము న్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు 25 శాతం కోటా తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. ఐదు వస్తువులతో కూడిన కిట్‌లను చైర్‌పర్సన్‌ అనూషతో కలిసి కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సి పల్‌ పారిశుద్ధ్య కార్మికుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఏ.జగదీశ్వర్‌గౌడ్‌ , ఎస్సై శంకర్‌, కౌన్సిలర్లు సాయి చరణ్‌గౌడ్‌, నరేష్‌కుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement