ఆదిలాబాద్‌టౌన్: కార్మికులు తమ హక్కులతో పా టు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌లో గల మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తు న్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో పా యల్ ఎమ్మెల్యే శంకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అశోక్, ఐటీఐ ఏటీఓ శ్రీనివాస్, మేసీ్త్ర సంఘం నా యకులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
దత్తత చట్టబద్ధంగా ఉండాలి
పిల్లల దత్తత చట్టబద్దంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో లీగల్ అడప్షన్ హెల్ప్‌డెస్క్, శిశు సంరక్షణ ఊయల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో గు ర్తించిన ఐదేళ్లలోపు పిల్లలు 40మంది ఉన్నారని తెలి పారు. పిల్లల సంరక్షణకు ఏర్పాటు చేసిన ఊ యల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధి కారి మిల్కా, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీసీ పీవో రాజేంద్ర ప్రసాద్,రాధిక,ఆనంద్ పాల్గొన్నారు.
శిశుగృహను సందర్శించిన కలెక్టర్..
జిల్లా కేంద్రంలోని శిశుగృహను కలెక్టర్ సందర్శించా రు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. శిశుగృహలో నూతనంగా నిర్మించిన అదనపు గదు ల భవనాన్ని ప్రారంభించి పిల్లల సంరక్షణపై ఆరా తీ శారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ రాథో డ్ శివరాం, బాలసంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసా ద్, స్వామి, విజయలక్ష్మి, స్వప్న తదితరులున్నారు.
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ
సాత్నాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భోరజ్ మండలం రాంపూర్ (టి) గ్రామంలో డ బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే శంకర్ హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. గతంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సులో వచ్చిన విన్నపాలను పరిశీలించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ వెల్లడించా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, హౌసింగ్ నోడల్ అధి కారి శంకర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ రాజేశ్వరి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మ న్ అశోక్‌రెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ, పాల్గొన్నారు.
రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కా ర్యక్రమంలో భాగంగా ఈనెల 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. శు క్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాలు, వరి ధాన్యం కొ నుగోలు, జనగణన స్వీయ నమోదు, నీట్ నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరె న్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో రైతు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలవుతోందని, కూలీలకు నిరంతరం పని కల్పిస్తున్నట్లు చెప్పారు. జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ చిత్రు, ఏఎస్పీ సురేందర్ రావు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఆర్డీవో రవీందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


