ఉట్నూర్‌రూరల్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నా రు. మండలంలోని దంతన్‌పల్లి, శ్యాంపూర్ పీహెచ్‌సీలను శుక్రవారం తనిఖీ చేశారు. రోగులతో మా ట్లాడి ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని పీవో మకరందు అన్నారు. కుమురం భీం కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను శుక్రవారం సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగారాం, శిక్షకులు పాల్గొన్నారు.
పీవోకు శుభాకాంక్షల వెల్లువ
ఇటీవల పీవోగా బాధ్యతలు చేపట్టిన మకరందును గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్‌కుమార్‌తో పాటు సిబ్బంది శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


