గ్రామాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి కృషి

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

● ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

బజార్‌హత్నూర్‌: నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి రోడ్డు వసతి లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బండ్రేవ్‌ వాగుపై వంతెనతో పాటు రహదారి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాంపూర్‌కు చేరుకున్న ఆయన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇందులో సర్పంచ్‌లు ప్రియాంకభీమేష్‌, సాయన్న, సు భాష్‌, ప్రవీణ్‌, రాజారాం, చంద్రశేఖర్‌, రాజేందర్‌, మారుతి, వినిల్‌, మురళీకృష్ణ, నర్సయ్య, రాజన్న, రమణ, రాజేశ్వర్‌, రమేశ్‌, కవీందర్‌ పాల్గొన్నారు.

కొత్త కోడళ్ల భేటీకి ఎమ్మెల్యే..

ఇచ్చోడ: మండలంలోని గుబ్బ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన సిడాం కొత్త కోడళ్ల భేటీకి ఆయన హాజరయ్యారు. గ్రామ సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇందులో పార్టీ మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, నాయకులు పాండురంగ్‌, రమేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement