బల్దియా కమిషనర్‌గా జగదీశ్వర్‌ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

బల్దియా కమిషనర్‌గా జగదీశ్వర్‌ బాధ్యతలు

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ నూతన కమిషనర్‌గా ఏ.జగదీశ్వర్‌గౌడ్‌ శుక్రవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పనిచేసిన జి.రాజును మంచిర్యాల కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో నిర్మల్‌ కమిషనర్‌గా పనిచేసిన జగదీశ్వర్‌గౌడ్‌ను ఇక్కడ నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రాజు నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షా, ఎమ్మెల్యే శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూషను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement