తాంసి: పంట విక్రయించేందుకు యార్డుకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్ యార్డులో చేపడుతున్న మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. రైతులతో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తా గునీరు, నీడ వసతి కల్పించాలని, ప్రతీ రైతు పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఈవో శ్రీనివాస్, రాంరెడ్డి, దత్తు, సొసైటీ కా ర్యదర్శులు సుధాకర్, సిద్ధాంత్, ఇంతియాజ్, అఖిల్ తదితరులున్నారు.


