బోథ్: రైతులు పంట దిగుబడులను దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ధార్మిక కార్యక్రమాలు సంప్రదాయాలకు ప్రతీక
నేరడిగొండ: ధార్మిక కార్యక్రమాలు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని సేవాదాస్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన జగదాంబదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, నాయకులు రవీందర్ రెడ్డి, పవన్, ప్రతాప్ సింగ్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి 5జీ మొబై ల్ ఫోన్లను ఇటీవల మంజూరు చేసింది. ఈమేరకు గుడిహత్నూర్ మండల అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు మండల కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, సూపర్‌వైజ ర్ జయశ్రీ, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.


