ఆదిలాబాద్‌టౌన్: నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుపై నిఘా పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు సిబ్బందితో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, గడ్డి మందుల విక్రయాలపై నిఘా పెంచాలన్నారు. రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్లలో సిబ్బంది పనితీరు మెరుగుపడేలా ఎస్‌హెచ్‌వోలు చొరవ చూపాలన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగించాలని, రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలు, ఆర్థిక నేరాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీలు మౌనిక, సురేందర్ రావ్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


