డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

రైతులు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు పొందాలి. విత్తనాలు విత్తిన తర్వాత ఆ ప్యాకెట్లను పారేయవద్దు. సీజన్‌ అయ్యేంత వరకు భద్రపర్చాలి. ఒకవేళ మొలకెత్తకపోయినా, కాత రాకపోయినా సంబంధిత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. గ్రామాల్లో నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం.

– శివకుమార్‌, ఏడీఏ, వ్యవసాయ శాఖ కార్యాలయం

నకిలీలపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం. ఇటీవల బేలలో గుజరాత్‌కు చెందిన నిందితుడి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్‌ చేశాం. అలాగే నలుగురిపై కేసులు నమోదు చేశాం. లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి.

– ఎల్‌.జీవన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement