శాస్త్ర సాంకేతికతతో వ్యవసాయ రంగం అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

శాస్త్ర సాంకేతికతతో వ్యవసాయ రంగం అభివృద్ధి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ఫలాలు క్షేత్రస్థాయిలో సామాన్య రైతులకు చేరినప్పుడే సాగు లా భసాటిగా మారుతుందని కలెక్టర్‌ రాజర్షిషా అన్నా రు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం 2026–27 సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా శాస్త్రవేత్తలు సమయానుకూల సూచనలు అందించాలన్నారు. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆయిల్‌పామ్‌ వంటి వాణిజ్య, అంతర పంటలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి విత్తనశుద్ధి నుంచి పంట కోత వరకు రైతులకు అండగా నిలవాలన్నారు. అనంతరం సోయాబీన్‌ విత్తనోత్పత్తి, పంట చీడపీడలపై రూపొందించిన అవగాహన కరదీపికను ఆవిష్కరించారు.ఇందులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌, పీజేటీఎస్‌ఏయూ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎం.బాల్‌రాజ్‌, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ యాకాద్రి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చౌహాన్‌, వ్యవసాయ మిషనరేట్‌ ప్రతినిధి అనిత, వివిధ జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

జిల్లాలో సరిపడా పెట్రో నిల్వలు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉ న్నాయని కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్‌ అధికారులు, బంక్‌ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జి ల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రవాణా ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో బంకుల వద్ద ఇంధన లభ్యతను నిరంతరం పర్యవేక్షించా లని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ మార్కెటింగ్‌, కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, పుకార్లు నమ్మి ప్రజలు బంకుల వద్ద బారులు తీరవద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో డిపోల నుంచి బంకులకు చేరుతున్న సరఫరా తీరుపై సమీక్షించారు. ఇందులో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ శాఖల అధికారులు, ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు, ఇంధన డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement