ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాల బారిన పడుతున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్‌లో 45.9, మంచిర్యాల జిల్లాలోని బీమారంలో 45.8, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 45.8, నిర్మల్‌లోని తానూర్‌లో 45.8, ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 45.8, కుమురంభీం జిల్లా కెరమెరిలో 45.7, బేలలోని చప్రాలలో 45.7, సిర్పూర్(టి)లో 45.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉదయం 9 దాటింతంటే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నా డు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. సాయంత్రం 7 దాటినా వడగాలు లు తగ్గడం లేదు. రాత్రి ఉక్కపోత ఇక్కట్లు వర్ణనాతీతం. కూలర్లు సైతం చల్ల గాలినివ్వడం లేదని పలువురు పేర్కొంటున్నారు.


