బీఆర్‌ఎస్‌లో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో ఇలా..

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఆయా పార్టీల పటిష్టత కోసం సంస్థాగత నిర్మాణం చేపడుతున్నాయి. ‘హస్తం’ పార్టీలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేడో.. రేపో మండల, పట్టణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలను ప్రకటించనున్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో జిల్లా, మండల, పట్టణ కమిటీలన్నింటినీ తాజాగా రద్దు చేశారు. పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. – సాక్షి,ఆదిలాబాద్‌

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ ముగింపు వేడుకలు ఇటీవల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విషయం తెలిసిందే. అధినేత కేసీఆర్‌ అందులో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై నేతలు, శ్రేణు లకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ పునర్‌ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేశారు. జిల్లా,

మండల, పట్టణ కమిటీలు ప్రస్తుతం రద్దయ్యాయి. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికి సంబంధించి అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే క్షేత్రస్థాయిలో నమోదు కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి జోగు రామన్న కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పార్టీ పరంగా యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్‌ పేర్కొన్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ నుంచి మొదలుకుంటే ఇంజినీరింగ్‌ కళాశాలల వరకు పార్టీ పరంగా కమిటీల యోచన చేస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో పార్టీని అన్ని విభాగాల పరంగా పటిష్టపర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement