● పార్టీ పటిష్టతపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఫోకస్ ● మండల, పట్టణ కమిటీలపై దృష్టి సారిస్తున్న ‘హస్తం’ ● బీఆర్‌ఎస్‌లో అన్ని కమిటీలు రద్దు ● సభ్యత్వ నమోదుకు ప్రణాళిక
‘హస్తం’ పార్టీలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల, పట్టణ, బ్లాక్‌కాంగ్రెస్ కమిటీలను ఒకట్రెండు రోజుల్లో నియమించనున్నారు. దీనికి సంబంధించి కమిటీలు అన్నింటిని రూపొందిం
చి టీపీసీసీకి పేర్లు పంపించారు. ప్రస్తుతం పార్టీలో జిల్లా కమిటీ మినహా ఇతర కమిటీలేమి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలపై శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సంస్థాగత నిర్మాణ పరంగా ఆలస్యమవుతుండడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా త్వరగా పూర్తి చేయాలని వారు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో కమిటీలే కీలకమని పేర్కొంటున్నారు.


