ఓటర్లు కదిలేనా.. పోలింగ్‌ శాతం పెరిగేనా? | - | Sakshi
Sakshi News home page

ఓటర్లు కదిలేనా.. పోలింగ్‌ శాతం పెరిగేనా?

Feb 11 2026 7:33 AM | Updated on Feb 11 2026 7:33 AM

ఓటర్లు కదిలేనా.. పోలింగ్‌ శాతం పెరిగేనా?

ఓటర్లు కదిలేనా.. పోలింగ్‌ శాతం పెరిగేనా?

● ‘స్వీప్‌’ ప్రచారం ఫలితమిచ్చేనా ● గత ‘పుర’ ఎన్నికల్లో 69శాతమే నమోదు

కై లాస్‌నగర్‌: ఓటు హక్కు వినియోగంలో పల్లె ఓట ర్లతో పోల్చితే పట్టణ ఓటర్లు ఎప్పుడూ కొంత వెనుకబడే ఉంటారు. ఓటు వేయడం మనకేందుకనో.. క్యూలో నిలబడడం అవసరమా అని భావించడ మో తెలియదు కానీ పట్టణ ఓటరు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపరు. ఇందుకు ఇటీవల జరిగిన పల్లె పోరు, గతంలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతమే నిదర్శనం. గతేడాది డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 86శాతం పోలింగ్‌ నమోదు కావడం పల్లె ఓటర్లలో వెల్లివిరిసిన ఓటు చైతన్యానికి అద్దం పడుతోంది. ఇదే స్ఫూర్తితో పట్టణంలోనూ వందశాతం పోలింగ్‌ నమోదు లక్ష్యంగా అధికార యంత్రాంగం స్వీప్‌ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించింది. అయితే ఇది ఏ మేరకు ఫలిస్తుందనేది నేడు స్పష్టం కానుంది.

ప్రచారం ఫలించేనా?

ఓటు ప్రాధాన్యతను వివరించేలా జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. పట్టణంలోని భా గ్యనగర్‌, కేఆర్‌కే కాలనీల్లో పలు కార్యక్రమాలు ని ర్వహించారు. ఎన్‌సీసీ కెడెట్లు, విద్యార్థులు, యువతతో పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. అన్ని వార్డుల్లోనూ బీఎల్‌వోలు, ఆశా, అంగన్‌వాడీలు, మున్సిపల్‌ సిబ్బంది ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవా లని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటు ప్రాఽ దాన్యత తెలియజేసేలా స్వీప్‌ ప్రత్యేక రథాల ద్వారా పట్టణంలో ప్రచారం చేశారు. అలాగే పట్టణంలోని ఐదు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఎంత వరకు ఫలిస్తాయి, వీటి ద్వారా ఓటర్లు కేంద్రాలకు కదులుతారా, పోలింగ్‌ శాతం ఏ మేరకు పెరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో ఇలా..

2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 49 వార్డుల పరిధిలో మొత్తం 1,27,922 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో 89,482 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 38,440 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పాలకులను ఎన్నుకోవడంలో ఓటు ఎంతో కీలకం. అయితే 69.95 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేయడం గమనార్హం.

ఈ సారి పెరిగేనా..

గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి పట్టణ పరిధిలో ఓటర్లు పెరిగారు. దీంతోనైనా పోలింగ్‌ శాతం పెరుగుతుందా లేక పాత పరిస్థితే ఉంటుందా అనే దాని పై చర్చ సాగుతోంది. బుధవారం నిర్వహించే ఎన్ని కల్లో పోలింగ్‌ శాతం గతంతో పోల్చితే అధికంగా న మోదయ్యే అవకాశముటుందని అధికారులు చెబు తున్నారు. ప్రస్తుతం1,43,655మంది ఓటర్లున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృ త ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించడంతో పాటు నగదు, మద్యం భారీగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఓటర్లు కదలివచ్చి తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తారా లేక మరోసారి వెనుకబడి ఉంటారా అనేది నేడు వెల్లడికానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement