క్యూఆర్‌.. జేబుకు చిల్లు! | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!

Aug 3 2025 3:10 AM | Updated on Aug 3 2025 3:10 AM

క్యూఆ

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!

నా పేరు శివప్రసాద్‌. ఆదిలాబాద్‌ వాసిని. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు మంచిర్యాల నుంచి ఆ డిపోకు చెందిన బస్సులో ఆదిలాబాద్‌ బయలుదేరా. కండక్టర్‌ టికెట్‌ అనడంతో ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తానని చెప్పా. ఆయన మిషన్‌లో క్యూఆర్‌ స్కానర్‌ను చూయించాడు. అందులో రూ.230 టికెట్‌ ఖరీదు రాగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేశా. డబ్బులు నా అకౌంట్‌ నుంచి డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అయితే మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా టికెట్‌ రాలేదు. దీంతో కండక్టర్‌ డబ్బులు చెల్లించి టికెట్‌ తీసుకోవాలన్నాడు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ తిరిగి వస్తాయని చెప్పాడు. చేసేది లేక డబ్బులిచ్చి టికెట్‌ తీసుకున్నాను. శనివారం వరకు కూడా ఆ డబ్బులు జమ కాలేదు. చాలా మంది అవి రావని చెబుతున్నారు.

సాక్షి, ఆదిలాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న ప్రయాణికులకు జేబులకు చిల్లుపడుతుంది. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అయినా మిషన్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి. ఒక వేళ ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే దిగిపోమ్మంటూ కండక్టర్లు చెప్పేస్తున్నారని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వమెమో ఆర్టీసీలో నగదు రహిత సౌలభ్యం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నా తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం.

ఐ–టిమ్‌ ద్వారా..

ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందుకోసం చలో కంపెనీ నుంచి ఐ–టిమ్‌ మిషన్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ రీజియన్‌లో గత ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. ఏసీ బస్సులు మొదలుకుని సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగుల్లోనూ అమలు పర్చారు. రీజియన్‌ పరిధిలోని ఆయా డిపోల్లో మొత్తం 520 మిషన్లు ప్రస్తుతం పని చేస్తున్నాయి. అయితే అత్యధిక మిషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్‌ ద్వారా డబ్బులు స్కాన్‌ చేస్తున్న ప్రయాణికులకు చుక్కెదురవుతుంది. డబ్బులు అకౌంట్‌ నుంచి కట్‌ అవుతున్నా టికెట్‌ మాత్రం జనరేట్‌ కావడం లేదు. దీంతో ప్రయాణికులు కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా సిగ్నల్‌ వీక్‌ ఉన్నచోట ఇవి పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు.

పరిశీలన చేస్తాం..

టిమ్‌ మిషన్లపరంగా ప్రయాణికులు వ్య క్తం చేస్తున్న ఈ సమస్యపై పరిశీలన చే స్తాం. ఒకవేళ అకౌంట్‌లో నుంచి డబ్బులు డ్రా అయిన పక్షంలో కండక్టర్లను ఓ నంబర్‌కు స్క్రీన్‌ షాట్‌ పెట్టాలని చెప్పాం. తద్వారా 24గంటల్లో ఆ ప్రయాణికులకు డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తాం.

– భవానీప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!1
1/3

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!2
2/3

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!3
3/3

క్యూఆర్‌.. జేబుకు చిల్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement