
ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర కీలకం
● ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్
బాసర: భారత ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. శనివారం ఆర్జీయూకేటీలో విద్యార్థులకు స్టార్టప్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ మార్గదర్శక విలువలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ప్రధానంగా ప్రారంభ దశ స్టార్టప్‌లలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టార్టప్‌లపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థిరత్వం, విస్తరణ ప్రాముఖ్యతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతి, నాగసాయి కుమార్, దిల్బహర్ అహ్మద్, చరణ్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.