
విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి
తలమడుగు: విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన జువ్వాక లక్ష్మి (48) ఆదివారం రాత్రి ఇంట్లోకి సరఫరా అయ్యే విద్యుత్ తీగపై ఆరేసిన బ ట్టలు తీస్తుండగా షాక్‌కు గురికావడంతో కిందపడిపోయింది. గమనించిన కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.