
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వి విధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామానికి చెందిన భీంరావ్ కిరాణ దుకాణం, నా ర్నూర్ మండలం గుండాలకు చెందిన ప్రవీణ్ ల్యాబ్, రెబ్బెన మండలం ఖావీగూడకు చెందిన చంద్రశేఖర్ టెంట్‌హౌస్ మంజూరు చేయాలని కోరా రు. ఇంకా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు స మర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో (పీవీ టీజీ) మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్‌వో సందీప్ కుమార్, ఏడీఎంహెచ్‌వో కుడిమేత మనోహర్, ఏవో దామోదరస్వామి, మనోహర్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.