విద్యుద్ఘాతంతో యువరైతు మృతి | Young Farmer Died Due To Electric Shock | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో యువరైతు మృతి

Jul 16 2023 1:44 AM | Updated on Jul 16 2023 8:48 AM

Young Farmer Died Due To Electric Shock - Sakshi

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని టక్కుగూడ గ్రామానికి చెందిన రైతు పంద్ర జైతు (24) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఎస్సై భరత్‌సుమన్‌ వివరాల ప్రకారం.. టక్కుగూడకు చెందిన మాన్కు కుమారుడు పంద్ర జైతు తనకున్న పంట పొలంలో మోటారు ద్వారా పంటకు నీరందించే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

గమనించిన చుట్టుపక్కల రైతులు జైతును ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ జైవంత్‌రావు, లింగోజితాండ సర్పంచ్‌ హరినాయక్‌లు ఆసుపత్రికి చేరుకొని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement