కైలాస్‌నగర్: ప్రకృతి వైపరీత్యాల సమయంలో జా తీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్‌డీఆర్‌ఎఫ్) దళా లు సత్వరం స్పందించి సకాలంలో సేవలందించా లని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలోని పెన్‌గంగ పరివాహాక, ముంపు ప్రాంతాల్లో వారం రోజుల పాటు పర్యటించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వారం పాటు వా రు చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా యువజన సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే తరుణంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వెంటనే స్పందించి సకాలంలో సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులు, కుంటలు తెగి పోయే ప్రమాదం ఉంటున్నందున, సమీప గ్రామా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందు కు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహకారం అవసరమన్నారు. ఈమేరకు యంత్రాంగం యాక్షన్ ప్లాన్ తో సత్వర చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రవాణాకు అత్యాధునికమైన వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం కమాండర్ సుజీత్ రోప్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాలకు లేఔట్లను సిద్ధం చేయాలి
జిల్లాలో ఇళ్ల స్థలాల భూముల సరిహద్దులు గుర్తించి, ప్లాట్లతో కూడిన లేఔట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇళ్ల స్థలాల పట్టా లు, ప్రజావాణి అర్జీల పెండింగ్, ధరణి, కోర్టు కే సులు, మీసేవ దరఖాస్తుల పెండింగ్ తదితర అంశాలపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పలు మండలాల పరిధిలో ఇళ్ల స్థలాలకు గుర్తించిన భూములకు సర్వేయర్ల ద్వారా హద్దులు గుర్తించాలన్నారు. గ్రామాల్లోని స మస్యలను మండలస్థాయిలో పరిష్కరించేలా అధి కారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భూ సమస్యలను వివిధ మాడ్యూల్‌లో ధరణి పోర్టల్‌లో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ట్రెయినీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఇన్‌చార్జి డీఆర్వో అరవింద్ కుమార్ పాల్గొన్నారు.