
పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
● కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు ప్రతీ మంగళవారం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీని కలెక్టర్ సందర్శించారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న మహిళలు ఈ సేవలను స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధి ని ర్ధారణ అయితే ప్రారంభ దశలో మందులతో న యం అవుతుందని తెలిపారు. ఓరల్ సర్వేకల్, రొ మ్ము క్యాన్సర్, థైరాయిడ్, ఆయోడిన్ లోపం, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, తదితర ఎనిమిది రకాల వైద్య కో సం ఈ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. 18 ఏళ్లు పైబడిన వారందరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూ చించారు. వైద్యాధికారులు, సిబ్బంది ఈకార్య క్రమంపై విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్‌ను కలిసిన మహిళా కమిషన్ మెంబర్
కైలాస్‌నగర్: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యురాలు పెందూర్ నీలదేవి మంగళవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిశారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు నర్సవ్వను ఆదుకోవాలని కోరారు. వర్షాకాలంలో కాలనీలోకి నీరు చేరి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ సమస్య రాకుండా చూడాలని కలెక్టర్‌కు నివేదించారు. ఈమేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.