
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామన్న
● ఎమ్మెల్యే జోగు రామన్న
జైనథ్: ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని నిరాల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి 700మంది రైతుల ఉసురు తీసిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ ప్రదాతగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, పెట్రో ధరలు పెంచడం, నిరుద్యోగులు, రైతుల ఉసురు తీయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధికి చూసి ఓర్వలేకనే, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, నిరాల సర్పంచ్ సునంద చంద్రకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోనాలలో..
బేల: మండలంలోని పోనాల గ్రామంలో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.