కైలాస్‌నగర్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు ఆరుకిలోల చొప్పున బియ్యం ఉచి తంగా అందనున్నాయి. ప్రతీ యూనిట్‌కు కిలో బియ్యం అదనంగా పెంచుతూ పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు నెలలుగా కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎఫ్ ఎస్‌సీ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలో లు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణకార్డుదారులకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లుగా డీఎస్‌వో కిరణ్‌కుమార్ తెలిపారు. రేషన్ దుకా ణాల్లో బియ్యం పంపిణీ ఏప్రిల్ 5నుంచి ప్రా రంభం కానున్నట్లుగా ఆయన వెల్లడించారు.
నేడు జాబ్ మేళా
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవా రం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సి పాల్ అనిత ప్రకటనలో తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన హెటేరో డ్రగ్స్ కంపెనీలో జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2020, 2021, 2022లో డిగ్రీ పూర్తి చేసిన, 2023లో డిగ్రీ పూర్తి కానున్న బీకాం, బీఏ, బీఎస్సీ (కెమిస్ట్రి) అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు రెజ్యూమె, సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో పాటు రెండు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం 98857 62227 నంబర్‌లో సంప్రదించా లని పేర్కొన్నారు.