
ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. కార్డు ఉన్న వారిలోనూ కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు చేర్చడం లేదు. దీంతో పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు అందించాలి.
– తూము సూర్యం, బీజేపీ నాయకుడు
ఇంకా ఆదేశాలు రాలే..
కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అనుమతి రాగానే కొత్త కార్డులు పంపిణీ చేస్తాం.
– కిరణ్ కుమార్, డీఎస్‌వో