
దీక్షకు సంఘీభావం తెలుపుతున్న సుహాసినిరెడ్డి
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలం బట్టిసావర్‌గాం శివారులోని సర్వేనంబర్ 72లో ఇంటి స్థలాల కు పట్టాలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు చేపట్టిన రిలే దీక్షలు 20వ రోజుకు చేరాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి మంగళవారం వారికి సంఘీభావం తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ భూములను పెద్దలు కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోని అధికారులు, ఆదివాసీలకు మాత్రం నివేశన స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఇందులో నాయకులు లీలావతి, రాము, కిరణ్, ఆనంద్, క్రాంతి కుమార్, విజయ్, సతీశ్, నరేశ్, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.