
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఐఈవో
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలు కొనసాగాయి. జనరల్ విద్యార్థులు 8,818 మందికి గాను 8,247 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 994 మందికి గాను 840 మంది హాజరు కాగా 153 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రవీందర్ కుమార్ తెలిపారు. ఈసారి పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా డిబార్ కాలేదు. ఈనెల 31నుంచి ఇంటర్ మూల్యాంకనం షురూ కానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్పాట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలి విడత ఈనెల 31 నుంచి, రెండో విడత ఏప్రిల్ 4 నుంచి, మూడో విడత ఏప్రిల్ 6 నుంచి, నాలుగో విడత 9 నుంచి ప్రారంభమవుతుందని డీఐఈవోవివరించారు. మూల్యాంకనం కోసం జిల్లాకు దాదాపు 3లక్షల జవాబు పత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.