
మాట్లాడుతున్న మధుసూదన్‌నాయక్
ఆదిలాబాద్‌టౌన్: బైక్‌తో ఢీకొట్టి దాడి చేసిన పలువురిపై టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై విష్ణు ప్రకాశ్ వివరాల ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మోసిన్ షరీఫ్ పిట్టలవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య సల్మాతో విభేదాల కారణంగా కోర్టులో వరకట్న కేసు కొనసాగుతోంది. ఆమెకు మెయింటెనెన్స్ కింద నెలకు రూ. 10 వేల చొప్పున అందజేస్తున్నాడు. భార్యతో పాటు ఆమె సోదరులు, బంధువులు ఒకేసారి రూ.25 లక్షలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోర్టు కేసులో భాగంగా మంగళవారం మోసిన్‌తో పాటు ఆయన భార్య, బావమరదులు కోర్టుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా కోర్టు సమీపంలో విద్యాంగుడైన మోసిన్‌ను ద్విచక్ర వాహనంతో బావమరిది ఢీకొట్టాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
31లోగా పట్టాల కోసం డీడీలు కట్టాలి
రామకృష్ణాపూర్: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని పట్టాలు పొందాలనుకునేవారు ఈ నెల 31తేదీలోపు డీడీలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులతో సమీక్షా నిర్వహించారు. జీవో నెం 76 ప్రకారం సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారు రామకృష్ణాపూర్ పట్టణంలో దాదాపు అందరూ డీడీలు కట్టి రిజిస్ట్రేషన్‌లు కూడా పూర్తి చేసుకున్నారని, ఇంకా 555 మంది డీడీలు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31 తర్వాత మళ్లీ అవకాశముండదని, 555 మంది డీడీలు కట్టేలా ఆయా వార్డుల కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మంచిర్యాల ఆర్డీవో వేణు, మందమర్రి తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ కళ ఉన్నారు.