
బ్యాంకులో అలుముకున్న పొగ
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల్ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఎన్‌రెడ్డి బ్రాంచ్‌లో ప్రమాదవశాత్తు మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం బ్యాంకులో సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అంతలోగా వారి దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీతో కొద్దిపాటి మంటలు ఆర్పివేశారు. అంతలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు పూర్తిగా ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని పలు డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. ఎవరికి ఎటువంటి అపాయం, ఆస్తి నష్టం జరగలేదు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో 39మందికి జరిమానా
నిర్మల్‌టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 39మందికి జరిమానా విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు నిర్మల్ పట్టణ ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడగా వారిని నిర్మల్ కోర్టులో హాజరు పరిచారు. 39 మందికి రూ.4,7300 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

మాట్లాడుతున్న ట్రాఫిక్ ఎస్సై