
ప్రజావేదిక నిర్వహిస్తున్న డీఆర్డీవో
● ప్రజావేదికలో వెల్లడించిన డీఆర్డీవో ● రూ.2,08,230 నిధులు రికవరీ చేస్తామని వెల్లడి ● రూ.25లక్షల నిధులతో చేపట్టిన పనులపై వెరిఫికేషన్‌కు ఆదేశం
ఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రెండ్రోజుల పాటు నిర్వహించిన 13వ విడత ఉపాధి హామీ ప్రజావేదికలో భారీగా అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. అనేక గ్రామాల్లో చేయని పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించిన అధికారులు, సిబ్బంది పలు చోట్ల బినామి పేర్లతో సైతం డబ్బులు కాజేసినట్టు వెల్లడైంది. మండలంలోని అనేక గ్రామాల్లో కూలీల నుంచి వారానికి రూ.100 ఆపైన వసూలుకు బాధ్యులైన మేట్లను తొలగించినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి వెల్లడించారు. మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 2019 నుంచి మార్చి 2022 వరకు రూ.17.75 కోట్ల విలువ చేసే పనులు జరిగాయని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం అవినీతి, అక్రమాలపై సామాజిక తనిఖీ చేపట్టి ప్రజావేదికలో గుర్తించినట్లు తెలిపారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారి నుంచి రూ.లక్షా 94వేలా 230 రికవరీ చేయిస్తామని తెలిపారు. పలు పనుల్లో పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో బాధ్యులైన వారికి రూ.14వేల జరిమానా విధించామన్నారు. రూ.25లక్షలతో చేపట్టిన ఉపాధి పనులపై క్వాలిటీ కంట్రోల్ ద్వారా రీ–వెరిఫికేషన్ చేసేందుకు ఆదేశించినట్లు ప్రకటించారు. రూ.2లక్షల పనులకు సంబంధించిన రికార్డులు అందలేదని వాటిని త్వరలోనే స్వాధీనం చేసుకుని పనులపై తిరిగి విచారణ చేస్తామన్నారు.
12వ విడతలో రూ.లక్షకుపైగా నిధుల రికవరీ
గతంలో నిర్వహించిన 12వ విడత ప్రజావేదికలో రూ.3లక్షలా 3వేలా 72 నిధుల దుర్వినియోగం జరి గిందని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. వాటిలో ను ంచి గత కొద్ది నెలల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా రూ.లక్షా 32వేలా 720 రికవరీ చేయించినట్లు తెలి పారు. మరో రూ.1,70,352 రికవరీ చేయాల్సి ఉందన్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే ప్రతీ కూలీకి డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో పడతాయని, అందుకోసం మేట్లు, అధికారులు, సిబ్బందికి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దన్నారు. ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలపై ఈజీఎస్ అధికారులు, సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శుల తీరుపై డీఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎంటీ దత్తు, హెచ్‌ఆర్ సుధాకర్, ఎంపీడీవో మల్లేష్ ఉన్నారు.