
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
● కలెక్టర్ రాహుల్‌రాజ్
కైలాస్‌నగర్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలకు ధరణి పోర్టల్‌లో మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న అర్జీలపై శాఖల వారీగా సమీక్షించారు. గత వారం నాటికి 834 అర్జీలు పెండింగ్‌లో ఉండగా 299 పరిష్కారమయ్యాయి. వచ్చే మూడు వారాల్లోగా అన్ని అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ట్రెయినీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జెడ్పీ సీఈవో గణపతి, తదితరులు పాల్గొన్నారు.