
పోషకాహార పదార్థాలు పరిశీలిస్తున్న కలెక్టర్
● కలెక్టర్ రాహుల్‌రాజ్
కైలాస్‌నగర్: ప్రజలు పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ్ అభియాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. సీడీపీఓలు, సూపర్ వైజర్లు కేంద్రాలను రెగ్యులర్‌గా పర్యవేక్షించాలన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో ఏ ఒక్క సామ్–మామ్ కేసులు ఉండకూడదని, అందుకు పోషణ్ అభియాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. చిరు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు వాటిని స్థానికంగా పండించేలా వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా రైతులను ప్రోత్సహించాలన్నారు. అనంతరం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు, ఆకుకూరలతో వండిన వివిధ వంటకాల ప్రదర్శనను కలెక్టర్ సందర్శించి ఆహార పదార్థాలను రుచి చూశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ట్రెయినీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.