
వంతెన పనులు పరిశీలిస్తున్న సుహాసినిరెడ్డి
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి
జైనథ్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తరోడ గ్రామంలో ఇటీవల కుంగిన వంతెనను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018లో కురిసిన భారీ వర్షాలకు తరోడ వంతెన కుంగడంతో రాకపోకలు నిలిచిపోయాయన్నారు. అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారన్నారు. అప్పుడే నూతన వంతెన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఈపాటికే పనులు పూర్తయ్యేవన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న అలసత్వంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.